Tuesday, September 17, 2024
Homeసినిమాఎన్టీఆర్ లేకుండానే 'వార్ 2' స్టార్ట్ చేశారా..?

ఎన్టీఆర్ లేకుండానే ‘వార్ 2’ స్టార్ట్ చేశారా..?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో ‘వార్ 2’ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీని బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వార్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీంతో ఇప్పుడు వార్ 2 మూవీని ప్రకటించినప్పుడు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సౌత్ హీరో, నార్త్ హీరో కాంబోని సెట్ చేయడంతో అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది..? ముఖ్యంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ను ఎలా డిజైన్ చేశారనేది ఆసక్తిగా మారింది.

అయితే.. ఈ చిత్రాన్ని డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారనుకున్నారు కానీ.. సైలెంట్ గా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యిందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. హృతిక్ రోషన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలిసింది. మరి.. ఎన్టీఆర్ ఎప్పుడు ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతాడు అంటే.. డిసెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడని టాక్.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ నవంబర్ కి కంప్లీట్ చేయాలనేది ప్లాన్. డిసెంబర్ నుంచి వార్ 2 షూటింగ్ తో పాటు దేవర 2 షూటింగ్ కూడా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఈ మూవీ షూటింగ్ గురించి చర్చించడం కోసమే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇటీవల హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ను కలవడం జరిగింది. త్వరలోనే వార్ 2 మూవీ గురించి అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. మరి.. ఎన్టీఆర్, హృతిక్ కలిసి ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Also Read: ఆస్కార్ అకాడమీ న్యూ మెంబర్ ఎన్టీఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్