Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Japan Open: శ్రీకాంత్, ప్రణయ్ ముందంజ

Japan Open: శ్రీకాంత్, ప్రణయ్ ముందంజ

జపాన్ ఓపెన్ లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్ లు మాత్రమే ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో మిగిలిన ఆటగాళ్ళు తొలి రౌండ్ లోనే పరాజయం పాలై వెనుదిరిగారు.

నిన్న మంగళవారం మొదలైన ఈ టోర్నీలో తొలిరోజు ప్రణయ్ తొలి సెట్ లో 11-10తో ఆధిక్యంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి, హాంగ్ కాంగ్ ఆటగాడు లాంగ్ అంగుస్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగడంతో ప్రణయ్ విజేతగా నిలిచాడు. మహిళల డబుల్స్ లో శిఖా గౌతమ్- అశ్విని భట్ లు; 15-21; 9-21 తేడాతో సౌత్ కొరియా జోడీ చేతిలో ఓటమి పాలయ్యారు.

నేడు జరిగిన మ్యాచ్ ల్లో  లక్ష్య సేన్, సైనా నెహ్వాల్, వెంకట్ గౌరవ్ ప్రసాద్-జూహీ దేవాంగన్ (మిక్స్డ్ డబుల్స్); ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల (పురుషుల డబుల్స్); గాయత్రి గోపీచంద్- త్రెసా జాలీ( మహిళల డబుల్స్) తమ ప్రత్యర్ధుల చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి వెనుదిరిగారు.

కిడాంబి శ్రీకాంత్  హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో 22-20;23-21 తో మలేషియా ఆటగాడు లీ జీ జియా ను ఓడించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నాడు.

కాసేపట్లో గరగ కృష్ణ ప్రసాద్- పంజాల విష్ణు వర్ధన్ గౌడ్  ద్వయం పురుషుల డబుల్స్ మ్యాచ్ ఆడనుంది.

ఇప్పటికి శ్రీకాంత్, ప్రణయ్ లు మాత్రమే తొలి రౌండ్ లో విజయం సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్