Sunday, January 19, 2025
HomeTrending Newsచంద్రబాబుకు ఐటి నోటీసులు!

చంద్రబాబుకు ఐటి నోటీసులు!

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సెంట్రల్ ఐటీ అధికారులు  నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై జాతీయ మీడియాలో, పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆయనకు సెక్షన్
153C షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  ఓ కేసులో షాపూర్‌ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ పార్ధసాని నివాసంలో గతంలో నిర్వహించిన ఐటీ  సోదాల్లో దీనికి సంబంధించిన ఆధారాలు, వాయిస్ రికార్డ్‌లను బట్టి చంద్రబాబుకి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా సెంట్రల్ ఐటీ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.

పలు నిర్మాణ సంస్థల నుంచి కిక్ బాక్స్ రూపంలో రూ.118 కోట్లు  చేరినట్లు ఆరోపణలున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పలు నిర్మాణ కంపెనీలకు కాంట్రాక్టులు, బోగస్ సబ్ కాంట్రాక్టులు ఇప్పించి లబ్ది పొందినట్లు నోటీసులో  ఐటి శాఖ  పేర్కొంది.  ఈ 118 కోట్లను అప్రకటిత ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని ఐటి శాఖ నోటీసుల్లో అడిగింది. ఆగస్ట్ 4 నే నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్