Saturday, January 18, 2025
HomeTrending Newsఫైనల్ 15 ప్రకటించిన బిసిసిఐ : సిరాజ్ కు చోటు!

ఫైనల్ 15 ప్రకటించిన బిసిసిఐ : సిరాజ్ కు చోటు!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎడురుచూస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటిసి) ఫైనల్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇండియా- న్యూజిలాండ్ జట్ల మధ్య ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ లో జూన్ 18 నుంచి 22 వరకూ ఈ మ్యాచ్ జరగనుంది.

అయితే ఇప్పుడు అభిమానుల దృష్టంతా రెండువైపులా తుది జట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపైనే ఉంది. తాజాగా డబ్ల్యూటిసి ఫైనల్లో ఆడే తుది 15 మంది జట్టుని బిసిసిఐ ప్రకటించింది. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా బిసిసిఐ వెల్లడించింది. భారత జట్టు ఓపెనర్లుగా రోహిత్ శర్మకు జోడీగా శుభమన్ గిల్ బరిలోకి దిగనున్నాడు.

రోహిత్ శర్మ, శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రెహానే, హనుమ విహారి, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహామ్మద్ షమి, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ లను ఎంపిక చేశారు. ఈ 15 మంది నుంచి మ్యాచ్ లో ఆడే 11 మందిని 18నాడు వెల్లడిస్తారు. 20 మంది సభ్యులున్న జట్టు నుంచి మయాంక్ అగర్వాల్, కే ఎల్ రాహుల్, శ్రాద్ధుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లను పక్కన పెట్టారు.

హైదరాబాదీ పేసర్ సిరాజ్ 15 మంది జట్టులో స్థానం లభించింది. చారిత్రాత్మక మ్యాచ్ లో సిరాజ్ ఆడతాడో లేదో వేచి చూడాలి.
భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి తో పాటు క్రికెట్ విశ్లేషకులు డబ్ల్యూటిసి ఫైనల్ విజేత నిర్ణయించేందుకు కేవలం ఒక్క టెస్ట్ మ్యాచ్ కాకుండా మూడు మ్యాచ్ ల సీరీస్ ను నిర్వహించాలని, వచ్చేసారి కైనా ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్