Sunday, January 19, 2025
Homeసినిమాఓడిపోతానేమోననే భయం నాకు లేదు: హీరో నాని 

ఓడిపోతానేమోననే భయం నాకు లేదు: హీరో నాని 

నాని – కీర్తి సురేశ్ జంటగా ‘దసరా’ సినిమా నిర్మితమైంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. తెలంగాణ నేపథ్యంతో కూడుకున్న కథాకథనాలతో ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేదికపై ఈ సినిమాను గురించి నాని – కీర్తి సురేశ్ – శ్రీకాంత్ ఓదెల మాట్లాడారు.

నాని మాట్లాడుతూ .. “ఈ సినిమాలో ధరణిగా నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందనేది చాలామందికి అర్థమైపోయింది. ఇక ‘వెన్నెల’గా కీర్తి సురేశ్ పాత్ర కూడా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఆమె పాత్ర చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. ఒక ముఖ్యమైన రోల్ చేసిన దీక్షిత్ శెట్టి కూడా, ఈ సినిమా తరువాత బిజీ అవుతాడు. ఇది పాన్ ఇండియా సినిమా అని మీరు అంటున్నారు. దీనిని ఐదు భాషల్లో రిలీజ్ అయ్యే సినిమా మాదిరిగానే నేను చూస్తున్నాను.

ఇది పాన్ ఇండియా సినిమా గనుక, ఆ తరువాత కూడా అలాంటి సినిమానే చేయాలనేం లేదు. ఎప్పటి మాదిరిగానే నాకు నచ్చిన కథలను చేసుకుంటూ వెళతాను. లుక్ పరంగా కూడా ‘పుష్ప’ సినిమాకీ .. ఈ సినిమాకి ఎలాంటి పోలిక లేదు. ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమా అయినా, సుకుమార్ గారు నాలుగు భాషల వారికి తెలియదు. మా డైరెక్టర్ ఐదు భాషల వారికి తెలియదు అంతే. అంతకు మించి నేను పెద్దగా ఆలోచించను. నా క్రేజ్ ను కాపాడుకోవాలి .. నిలబెట్టుకోవాలనే బెంగ గానీ , ఓడిపోతానేమోననే భయంగాని నాకు లేవు” అంటూ చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్