Tuesday, February 25, 2025
HomeTrending Newsప్రజలు వారిని నమ్మరు: కారుమూరి

ప్రజలు వారిని నమ్మరు: కారుమూరి

ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే తమ ఓటు బ్యాంక్ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అన్నారు.  పారదర్శకంగా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేసినా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

జనసేన అధినేత పవన్ తణుకు నుంచి పోటీ చేస్తే ఆయన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. లోకేష్, చంద్రబాబులు ఎన్ని యాత్రలు చేసినా ప్రయోజనం లేదని, వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. లోకేష్ యాత్రను ప్రజలు జోక్ లా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్