Friday, September 20, 2024
HomeTrending NewsJana Sena: పాత ధరలకే మద్యం విక్రయం : పవన్

Jana Sena: పాత ధరలకే మద్యం విక్రయం : పవన్

సిఎం జగన్ తన ఒళ్లో చిన్న పాపను కూర్చోబెట్టుకొని పలకపై అక్షరాలు దిద్దిస్తుంటే తనకు గాంధీజీ గుర్తుకొచ్చారని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.  అయితే గాంధీజీ ‘సత్య శోధన’ అనే పుస్తకం రాశారని, కానీ భవిష్యత్ లో  సిఎం జగన్ ‘అసత్య శోధన’ అనే పుస్తకం  రాస్తారంటూ సెటైర్లు  వేశారు. జనసేన వారాహి విజయ యాత్రలో భాగంగా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. గాంధీజీ my experiments with truth  అనే పుస్తకం రాశారని… జగన్ my extortions in andhra pradesh state అని రాస్తారేమో అన్నారు.

సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడం చాలా కష్టమని, జనసేన అధికారంలోకి రాగానే పాత ధరలకే మద్యం అమ్మకాలు చేస్తామని, దీనిపై వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని గీత కార్మికుల కోసం ఖర్చు చేస్తామని పవన్ ప్రకటించారు. ఏ ప్రాంతంలోనైనా ఆడ పడుచులు మద్యం అమ్మొద్దని అడిగితే  ఆ ప్రాంతంలో మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చారు.

తాను ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడుతుంటే సిఎం జగన్  తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారని, ఆయన వ్యక్తిగత జీవితం గురించి తనకు చాలా తెలుసనీ,  మీ మనిషిని ఎవరినైనా పంపిస్తే తాను చెప్పే విషయాలకు వారి చెవుల్లో రక్తం వస్తుందని హెచ్చరించారు. వారు మాట్లాడినంత మాత్రాన తనకు ఏమీ కాదని… వెంట్రుక అంటూ వ్యాఖ్యానించారు. తాను విప్లవ భావాలతో వచ్చిన వాడినని దేనికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసనీ అన్నారు.

అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకున్తున్నామని కానీ ఈ ప్రభుత్వం ఆయన పేరిట ఉన్న విదేశీ విద్య పథకాన్ని మార్చి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నారని, డబ్బు మనందరిదీ పేరు ఆయనదా అని ప్రశ్నించారు. భీమవరంలో తాను ఓడిపోయానని అందరూ అంటున్నారని, కానీ ఈరోజు ఈ సభకు వచ్చిన జన సంద్రాన్ని చూసి ఆ మాట ఎవరైనా అనగలరా అని పవన్ అడిగారు. కులాలను దాటి అభివృద్దిపై ఆలోచించాలని అన్నారు. అన్యాయం జరిగినప్పుడు ఊగిపోతూనే మాట్లాడతారని కావాలంటే ఈ విషయాన్ని వారి పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, మొన్న హత్యకు గురైన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడగాలని సూచించారు. కొండపల్లి సీతారామయ్య, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వారి లాగా ఈ సిఎం క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కులం పేరు వెనక పెట్టుకున్న వ్యక్తికి  దీనిపై మాట్లాడే హక్కు లేదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్