Pooja Hegde : ప్రభాస్, పూజా హేగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఈ భారీ పాన్ ఇండియా మూవీని జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పూజా హేగ్డే మీడియాతో మాట్లాడుతూ రాధేశ్యామ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…
రాధే శ్యామ్ చిత్రంలో ప్రేరణ అనే పాత్రలో నటించాను. జీవితాన్ని ప్రతి రోజూ ఆస్వాదించాలి అనుకునే అమ్మాయి ప్రేరణ. అందంగా ముస్తాభవుతుంది. ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రేరణతో కొన్ని సందర్భాల్లో నన్ను నేను పోల్చుకోగలను. ఇది రెగ్యులర్ లవ్ స్టొరీ లా ఉండదు. ఇటువంటి మూవీ చేయడానికి దేవుడు నాకొక ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో నాది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా డెప్త్ ఉంటుంది. ఇందులో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ కోసం నేను చాలా బుక్స్ చదివాను. నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమాతో జర్నీ చేస్తున్నాను.
ఇది పీరియాడిక్ మూవీ. కానీ యూరప్ లో కథ జరుగుతుంది కాబట్టి అక్కడి సంప్రదాయ, వేషభాషలు ఎలా ఉంటాయో వాటి ప్రకారమే చిత్రీకరణ జరిపారు. షూటింగ్ కోసం జార్జియా వెళ్లినప్పుడు మూడు రోజులు షూటింగ్ చేయగానే ఫస్ట్ లాక్ డౌన్ పెట్టారు. భయంభయంగా తిరిగొచ్చాం. అది నా కెరీర్ లో ఎక్కువగా భయపడిన సందర్భం. తెలిసిన వాళ్లు ఫోన్లు చేసి బతికుంటే షూటింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. తిరిగొచ్చేయ్ అన్నారు.
ఇటలీ షూటింగ్ టైమ్ లో నా పర్సనల్ టీమ్ లో ముగ్గురికి కోవిడ్ వచ్చింది. అప్పుడు ప్రభాస్ తన టీమ్ తో ఫుడ్ వండించి పంపేవారు. ప్రభాస్ బయట ఎక్కువగా మాట్లాడరు గానీ సెట్ లో జోవియల్ గా ఉంటూ ఎంతో సందడి చేస్తూనే ఉంటారు. ప్రభాస్ తో పెయిర్ బాగుందని చెబుతున్నారు. దీనికి మా ఇద్దరి హైట్స్ దాదాపు మ్యాచ్ అవడమే కారణం అనుకుంటా. రాధే శ్యామ్ కు టైటానిక్ మూవీకి సంబంధం లేదు. షిప్ సీన్స్ ఉన్నాయి అంతే. టైటానిక్ తో పోల్చడం మా సినిమా గౌరవమే.
ప్రేరణగా నటించే కొన్ని సీన్స్ లో నిజంగానే ఏడ్చేశాను. అయితే దర్శకుడు కట్ చెప్పాక మళ్లీ హిందీకి చేద్దాం రెడీ అన్నారు. ఇప్పుడే పూర్తయ్యింది. మళ్లీ ఏడవాలా అనుకునేదాన్ని. నేను ఆస్ట్రాలజీ ని నమ్ముతాను.చాలా సార్లు నేను ఆస్ట్రాలజీ దగ్గరకు వెళ్లడం జరిగింది. మన భారతీయ సంప్రదాయం చాలా గొప్పది, చారిత్రకమైనది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి లేని రోజుల్లో మన పూర్వీకులు ఖగోళం, సైన్స్ లో అద్భుతాలు సృష్టించారు.
అతి తక్కువ సమయంలోనే డిఫ్రెంట్ క్యారెక్టర్స్ చేస్తూ హిందీ, మలయాళం, కన్నడ సినిమాలు చేసినా తెలుగులో చేసిన సినిమాల వలనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. అందుకే నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెపుతున్నాము.టాలీవుడ్ లోని అందరి హీరోలతో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషముగా ఉంది. నేనే నెంబర్ వన్ హీరోయిన్ అనుకోవడం లేదు. నెంబర్ వన్ అనేది ట్రెండ్ , నేను ట్రెండ్ లో ఉండను. క్లాసిక్ గా ఉండాలను కుంటున్నాను. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. నేనుంటే బాగుంటుంది అనుకోబట్టే హీరోలు, నిర్మాతలు, దర్శకులు మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తున్నారు.