Saturday, June 29, 2024
Homeస్పోర్ట్స్వెళ్లి ఆటో నడుపుకోమన్నారు : సిరాజ్

వెళ్లి ఆటో నడుపుకోమన్నారు : సిరాజ్

faced humiliation: తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు యాజమాన్యం తనకు అందించిన తోడ్పాటు మరువలేనిదని హైదరాబాదీ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వెల్లడించాడు. 2019 ఐపీఎల్ లో బెంగుళూరు జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని, తన బౌలింగ్ అంతకంటే బాగా లేదని, కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 2.2 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చానని గుర్తు చేశాడు.  ఆ సీజన్ తోనే తన ఐపీఎల్ కెరీర్ ముగిసిపోయిందనే భావనకు వచ్చానని, కానీ జట్టు యాజయాన్యం, కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు అందించిన సహకారం, ప్రోత్సాహం మరువలేనిదని సిరాజ్ భావోద్వేగం వ్యక్తం చేశాడు.  కావాల్సినంత వయసు ఉంది కాబట్టి  ఆటతీరు మెరుగు పరచుకోవడంపై దృష్టి పెట్టాలనే నిర్ణయానికి తాను వచ్చానన్నాడు. అదే సమయంలో తన ఫ్రాంచైజీ తన వెన్నంటి ఉందని, అదే మరో ఫ్రాంచైజీ అయితే నిర్మొహమాటంగా బైటకు పంపి ఉండేవారని సిరాజ్ అభిప్రాయపడ్డాడు.

2019లో కోల్ కతా మ్యాచ్ తరువాత తన ఐపీఎల్ కెరీర్ ముగిసిందనే  విమర్శలతో పాటు, మరి కొందరైతే ‘క్రికెట్ మానుకొని వెనక్కు వెళ్లి తండ్రితో పాటు ఆటో నడుపుకోమంటూ’ సలహాలు కూడా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు.  తాను పూర్తి  నిరాశా నిస్పృహ లో ఉన్నప్పుడు ధోనీ ‘నువ్వు బాగా ఆడిన రోజున పొగిడిన వ్యక్తులే బాగా ఆడని రోజున విమర్శలు చేస్తారు….  కాబట్టి అలాంటి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవద్దు, ఆటపై దృష్టి పెట్టు’ అంటూ ఇచ్చిన స్పూర్తి తనపై ఎంతో ప్రభావం చూపిందన్నారు.

ఐపీఎల్ 2019  సీజన్లో సిరాజ్ 9 మ్యాచ్ లు ఆడి 7 వికెట్లు పడగొట్టాడు.  ఓవర్ కు సగటున 9.55 పరుగులు సమర్పించుకున్నాడు. మరుసటి ఏడాది 2020 సీజన్లో తన సత్తా చాటి వికెట్లు రాబట్టాడు. ఆ ఐపీఎల్ లో రెండు మెయిడెన్ ఓవర్లు వేసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు.  దీని తర్వాత జరిగిన ఆస్ట్రేలియా టూర్ కు ఎంపికయ్యాడు. ఆ టూర్ లో మూడు టెస్టులు ఆడిన సిరాజ్ 13 వికెట్లు తీసుకొని అందరి దృష్టినీ ఆకర్షించాడు.

‘నువ్వు రాణించిన తీరు అద్భుతం, ఈ ప్రదర్శన ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేనిది, ఇదే ఆట తీరు కొనసాగించు, దేహ దారుధ్యంపై దృష్టి పెట్టు, మరింత కష్టపడు’ అంటూ ఆస్ట్రేలియా టూర్ నుంచి రాగానే విరాట్ చెప్పిన మాట నేను ఎప్పటికీ మరువలేనని సిరాజ్ వివరించాడు.

Also Read : కబడ్డీ: జైపూర్ విన్, బెంగాల్-తెలుగు మ్యాచ్ టై

RELATED ARTICLES

Most Popular

న్యూస్