Saturday, November 23, 2024
HomeTrending Newsహుజురాబాద్ లో ఓటమికి నాదే బాధ్యత

హుజురాబాద్ లో ఓటమికి నాదే బాధ్యత

I Was Responsible For The Defeat Of The Congress In Huzurabad :

హుజురాబాద్ ఉప ఎన్నిక పార్టీ కార్యకర్తలను నిరాశపరిచాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ అభ్యర్థి వెంకట్ నిరాశ చెందాల్సిన అవసరం లేదు- వెంకట్ కు మంచి భవిష్యత్తు ఉందన్నారు.  హుజురాబాద్ ప్రజల కోసం భవిష్యత్తు లో పోరాటం చేస్తాడని హైదరాబాద్ లో చెప్పారు.

హుజురాబాద్ ఎన్నికల ఫలితాలపై సంపూర్ణమైన భాద్యత తనదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నివేదికలు తెప్పించుకొని విశ్లేశన చేసుకుంటామన్నారు. రాబోయే రోజులన్ని కాంగ్రేస్ పార్టీవేనని, ప్రజా సమస్యలపై మరింత బాధ్యతగా పోరాడుతామన్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగాయని, ఉప ఎన్నికలు పార్టీ భవిష్యత్ ను నిర్ణయించలేవని రేవంత్ తెలిపారు. గత ఎన్నికల్లో బిజెపి కి 16వందల ఓట్లు మాత్రమే వచ్చాయని అదే బిజెపి ఇప్పుడు గెలిచిందన్నారు. మొన్న జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికలో బీజేపీ కనిపించలేదని, ప్రజల కోసం నేను ఉంటానని, ఈ ఓటమి నన్ను కుంగదియ్యదన్నారు.

కాంగ్రేస్ సీనియర్ నాయకులకు పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని, పార్టీ విషయాలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటామని రేవంత్ చెప్పారు. సీనియర్లను పార్టీ కార్యక్రమాల్లో కలుపుకుని వెళతామని రేవంత్ పేర్కొన్నారు.

Must Read :హుజురాబాద్ చెప్పే పాఠం

RELATED ARTICLES

Most Popular

న్యూస్