Wednesday, May 7, 2025
HomeTrending Newsచివరి రక్తపు బొట్టు వరకూ జగన్ తోనే...

చివరి రక్తపు బొట్టు వరకూ జగన్ తోనే…

ఎప్పటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.  ఇదంతా కొన్ని మీడియా సంస్థలను అడ్డు పెట్టుకొని చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ అని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కోవూరులో తనకు కాకుండా వేరొకరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపించేందుకు సిద్ధమని ప్రకటించారు. జగన్ నిలబెట్టే ఎవరికైనా తానూ మద్దతిస్తామనన్నారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధికి ఓటు వేశారన్న అనుమానంతో..  నెల్లూరు జిలాకు  చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలలతో పాటు తాడికొండ ఎమ్మెల్యే డా. ఉండవల్లి శ్రీదేవి సహా నలుగురిని వైఎస్సార్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.  అప్పటి నుంచి నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. ఈ ముగ్గురితో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా టిడిపి వైపు చూస్తున్నారనే వదంతులు ప్రచారంలో ఉన్నాయి. నిన్న మేకపాటి  విక్రమ్ రెడ్డి పై ఇలాంటి వార్తే  బైటకు వచ్చింది, దాన్ని ఆయన ఖండించారు. నేడు నల్లపురెడ్డి వంతు వచ్చింది.

నల్లపురెడ్డి  నేడు స్వయంగా మీడియాతో మాట్లాడుతూ చివరి రక్తపు బొట్టు వరకూ జగన్ తోనే ఉంటానని, తాను చనిపోయినా… తన కుమారుడు  రంజిత్ కుమార్ రెడ్డి సైతం జగన్ తోనే  పయనిస్తారని  తేల్చి చెప్పారు. తనపై ఇలాంటి వార్తలు రాసేవారు రెడ్ లైట్ ఏరియాలో పుట్టి ఉంటారని తీవ్రంగా మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్