Tuesday, April 16, 2024
HomeTrending Newsగౌతమ్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తా

గౌతమ్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తా

Investments: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామికలకు, పెట్టుబడులకి అనుకూలమని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  900 కి.మీలకు పైన తీరప్రాంతం, జాతీయ రహదారులు, నాలుగు పోర్టులు ఉన్నాయ‌ని చెప్పారు.  దేశంలోనే గొప్ప పరిపాలనాదక్షుడైన సిఎం జగన్ ఆధ్వర్యంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాన‌ని సంతోషం వ్యక్తం చేశారు. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సేవలను కూడా ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.  రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న అయన ఆశయాలని కొనసాగిస్తాన‌ని అమర్‌నాథ్‌ హామీ ఇచ్చారు.
సచివాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్రత్యేక పూజలు చేసిన‌ అనంతరం మంత్రిగా అమర్‌నాథ్‌ బాధ్యతలు చేపట్టారు. త‌న‌కు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి స్ధానంలో కూర్చోబెట్టే అవకాశం ఇచ్చిన అనకాపల్లి ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాన‌న్నారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టుకి అవసరమైన భూసేకరణలో భాగంగా రైతులకి ఇచ్చే రూ.8 కోట్ల పరిహారంపై తొలి సంతకం చేశారు.
ఐటి, పరిశ్రమల శాఖల మంత్రిగా త‌న‌పై సిఎం జగన్ ఓ గురుతరమైన బాధ్య‌త ఉంచార‌ని,  సక్రమంగా  విధులు నిర్వహించి రాష్ట్రానికి మంచి చేస్తానని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ విషయంలో ఏపీకి మంచి జరిగే విధంగా కృషి చేస్తాన‌న్నారు.  ఏపీలో పారిశ్రామిక అభివృద్ది, ఐటీకి చిరునామాగా ఉన్న విశాఖ నుంచి వచ్చిన వ్యక్తిగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది చేస్తాన‌ని వివ‌రించారు. విశాఖకి ఐటీ ఆద్యుడైన దివంగత మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తాన‌ని చెప్పారు. చెన్నై, బెంగుళూరు, ముంబయి లాంటి నగరాలతో పోటీ పడగల అవకాశం విశాఖ‌ప‌ట్నానికి ఉంద‌న్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్