Monday, June 8, 2026
Homeసినిమాప్ర‌భాస్ షాకింగ్ కామెంట్స్

ప్ర‌భాస్ షాకింగ్ కామెంట్స్

I Will rectify: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంట‌గా న‌టించిన భారీ పిరియాడిక్ ల‌వ్ స్టోరీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దాదాపు నాలుగేళ్ల పాటు సినీ ప్రియులను ఊరించిన ఈ చిత్రం.. ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. కానీ భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయింది.

అయితే.. తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన‌ ఇంటర్ వ్యూలో ప్రభాస్.. రాధేశ్యామ్ పై తొలిసారి స్పందిస్తూ ఫెయిల్యూర్ ను అంగీకరించారు. ఇంత‌కీ ప్ర‌భాస్ ఏం చెప్పారంటే… మాస్ ఇమేజ్ ఉన్న నన్ను ప్రేమ కథల్లో ప్రేక్షకులు ఇష్టపడి ఉండకపోవచ్చు లేదా స్క్రిప్ట్ లో లోపం ఉండవచ్చు. అందుకే సినిమా ఫ్లాప్ అయింది. పైగా రిలీజ్ టైమ్ కి కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గకపోవడమే సినిమాకు మరింత మైనస్. ఏది ఏమైనా ఈ సినిమా చేయ‌డం మిస్టేకే. ఇక నుంచి ఇలాంటి మిస్టేక్స్ జ‌ర‌గ‌కుండా చూసుకుంటాను అన్నారు ప్ర‌భాస్. దీంతో రాధేశ్యామ్ గురించి ప్ర‌భాస్ చేసిన ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Also Read :  రాధేశ్యామ్’లో హైలైట్ సీన్స్ ఇవే! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular