Saturday, January 18, 2025
Homeసినిమాబాలయ్యతో మరిన్ని సినిమాలు ఉంటాయి: బోయపాటి

బాలయ్యతో మరిన్ని సినిమాలు ఉంటాయి: బోయపాటి

బాలకృష్ణ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిన సినిమాలలో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమాలో బాలకృష్ణను లుక్ పరంగా చాలా కొత్తగా .. ఆకర్షణీయంగా చూపించడంలో బోయపాటి సక్సెస్ అయ్యాడు. కథాకథనాలు .. బాలకృష్ణ పాత్ర విషయంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకున్నాడు.  ఆ పాత్ర స్థాయికి తగినట్టుగా బాలయ్య బైక్ ను .. జీప్ ను ఆయన హైలెట్ చేశాడు. అప్పటివరకూ ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న జగపతిబాబును విలన్ గా పరిచయం చేశాడు.

బాలకృష్ణ సినిమా అనగానే భారీతనం దాని ప్రధమ లక్షణంగా .. ప్రధానమైన లక్షణంగా కనిపిస్తుంది. అదే పద్దతిని ఈ సినిమా కూడా అనుసరించింది. 14 రీల్స్ – వారాహి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, 2014 .. మార్చి 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. నిన్నటితో ఈ సినిమా పదేళ్లను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ అందుకు సంబంధించిన సెలబ్రేషన్స్ ను ఏర్పాటు చేసింది. అందరూ కూడా ఈ సినిమా విశేషాలను మరోసారి గుర్తుచేసుకున్నారు.

ఈ సినిమా నుంచి బాలకృష్ణ – బోయపాటి మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. నిజానికి ఇతర హీరోలతో కంటే బాలయ్యతో బోయపాటి చేసిన సినిమాలే భారీ వసూళ్లను రాబట్టాయి. బాలయ్య బాడీ లాంగ్వేజ్ ను .. ఆయన నుంచి అభిమానులు కోరుకునే అంశాలను బోయపాటి గట్టిగానే పట్టాడు. త్వరలో వీరిద్దరూ ‘అఖండ’ సీక్వెల్ కూడా చేయనున్నారు. ఆ సినిమా మాత్రమే కాకుండా ఇకపై కూడా బాలకృష్ణతో మరిన్ని సినిమాలు చేస్తానని బోయపాటి అనడం విశేషం. బాలకృష్ణ కూడా ఉత్సాహాన్ని చూపించడం మరో విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్