Social justice: సమసమాజ స్థాపన కోసం నడుంబిగించిన సామాజిక విప్లవవాది సిఎం జగన్ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సామాజిక న్యాయాన్ని మన రాష్ట్రంలో జగన్ చేశారని కొనియాడారు. మన రాష్ట్రంలోలాగే అందరు ముఖ్యమంత్రులు చేస్తే సామాజిక న్యాయం కోసం బడుగు బలహీన వర్గాలు గొంతెత్తాల్సిన అవసరం ఉండదన్నారు. సచివాలయంలో రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రిగా జోగి బాధ్యతలు స్వీకరించారు. విశాఖలో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేశారు.
ఈ సందర్భంగా జోగి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ళ నిర్మాణమే ధ్యేయంగా సిఎం జగన్ నాయకత్వంలో సర్వ శక్తులూ ఒడ్డికృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుపేదల ఇళ్ళ నిర్మాణానికి గతంలో 90 సిమెంట్ బస్తాలు అందించేవారని, దాన్ని 140కు పెంచుతూ సిఎం జగన్ నిర్ణయం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విశాఖలో అక్క చెల్లెమ్మలకు పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణం చేపడతామనన్నారు. కొందరు కోర్టులకు వెళ్లి ఆడుకున్నారని, ఇటీవలే హైకోర్టు ఇళ్ళ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దృష్ట్యా త్వరలో లబ్దిదారులకు అందజేస్తామని వివరించారు.
రాష్ట్రంలో 31 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లు కట్టించే గృహ నిర్మాణ శాఖను సిఎం జగన్ తనకు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. పేదవాడి సొంతింటి కలను సీఎం చేస్తున్నారన్నారని అన్నారు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరినీ ఏకం చేసి జగన్ నాయకత్వాన్ని బలబరుస్తామని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన జోగి రమేష్ కు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలియజేశారు.
Also Read : విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాం: రోజా