Saturday, January 18, 2025
Homeసినిమాసముద్రఖని దర్శకత్వంలో చేయాలనుంది: నితిన్ 

సముద్రఖని దర్శకత్వంలో చేయాలనుంది: నితిన్ 

నితిన్ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా రూపొందింది. సుధాకర్ రెడ్డి – నికితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి గ్రాండ్ గా జరిగింది. ఈ వేదికపై నితిన్ మాట్లాడుతూ .. ” 20 ఏళ్లుగా నన్ను ఆదరిస్తూ  .. ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాను. మరో 20 ఏళ్లు మీ కోసం కష్టపడటానికి రెడీగా ఉన్నాను. ఎడిటర్ గా శేఖర్ నాకు బాగా తెలుసు. ఎక్కడా తడబడకుండా ఆయన ఈ సినిమాను తీశాడు. ఆయన కష్టం తప్పకుండా ఫలిస్తుందనే నమ్మకం ఉంది.

కేథరిన్ .. కృతి శెట్టి పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కృతి చాలా అమాయకురాలు గా కనిపిస్తుందిగానీ .. చాలా తెలివైంది. తప్పకుండా తాను నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. మహతి స్వరసాగర్ అందించిన పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. తప్పకుండా తాను తండ్రిని మించిన తనయుడుగా పేరు తెచ్చుకుంటాడు. ఈ సినిమాలో నా  డాన్సులు .. ఫైట్లు అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సినిమా చూసిన తరువాత ఆ విషయాన్ని  మీరు ఒప్పుకుంటారు.

ఈ సినిమాకి సముద్రఖని గారి పాత్ర చాలా హైలైట్ అవుతుంది .. ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకత్వంలోను సినిమా చేయాలనుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో పాటు కామెడీ కూడా మీకు కావలసినంత ఉంటుంది. వెన్నెల కిశోర్ మీకు నాన్ స్టాప్ గ్గా కితకితలు పెడుతూనే ఉంటాడు. మా కాంబినేషన్లోని సీన్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను. సక్సెస్ మీట్లో మళ్లీ కలుసుకుందాం” అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read : మాచర్ల నియోజకవర్గంలో రాజప్పగా సముద్రఖని 

RELATED ARTICLES

Most Popular

న్యూస్