Tuesday, September 24, 2024
HomeTrending Newsకోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లకు జరిమానా

కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లకు జరిమానా

అమరావతి హైకోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు 8 మంది ఐఏఎస్‌లకు రెండు వారాలపాటు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఎటువంటి ప్రభుత్వ భవనాలు నిర్మించకూడదని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌, రాజశేఖర్‌, చినవీరభధ్రుడు, విజయ్‌కుమార్‌, జె.శ్యామలరావు, శ్రీలక్ష్మి, ఎంఎం నాయక్‌లకు ఈ మేరకు హైకోర్టు శిక్ష విధించింది. కాగా.. వీరంతా బేషరతుగా కోర్టును క్షమాపణ కోరి సమాజ సేవ చేస్తామని చెప్పడంతో ఆ ఉత్తర్వులను సవరించింది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని, ఒక రోజు పాటుకోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్‌లను హైకోర్టు ఆదేశించింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్