తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు అయ్యాయి. మంగళవారం తెలంగాణలో 15 మంది ఐఏఎస్ ను బదిలీలను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ బదిలీల ప్రకారం మహిళా శిశు సంక్షేమ స్పెషల్ సెక్రటరీగా భారతి కొలికేరి, హనుమకొండ కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, నిజామాబాద్ కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హనుమంతు, వికారాబాద్ కలెక్టర్ గా నారాయణరెడ్డి, ఆదిలాబాద్ కలెక్టర్ గా రాహుల్ రాజ్, ఆసిఫాబాద్ కలెక్టర్ గా షేక్ యాసిన్ భాష, మహబూబ్నగర్ కలెక్టర్ గా జి రవి, సూర్యాపేట కలెక్టర్ గా వెంకట్రావులను బదిలీ చేశారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా హరీష్, మంచిర్యాల కలెక్టర్ గా సంతోష్ మెదక్ కలెక్టర్ గా రాజార్షిషా, వనపర్తి జిల్లా కలెక్టర్ గా తేజస్, నిర్మల్ కలెక్టర్ గా వరుణ్ రెడ్డి , జగిత్యాల కలెక్టర్ గా ఆర్ వి కర్ణన్ ప్రభుత్వం నియమించింది.
మరోవైపు ప్రభుత్వం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్ కు బాధ్యతలు అప్పగించింది. కమిషనర్, సీసీఎల్ఏగా కూడా నవీన్ మిట్టల్ కు అదనపు బాధ్యతల అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఈ మేరకు జీవో 153 జారీ అయింది. ధరణిలో లోపాలు, రైతుల ఇబ్బందులు విపక్షాల ఆరోపణల నేపథ్యంలో… శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నవీన్ మిట్టల్ కు అదనపు బాధ్యతలు కట్టబెట్టటం ప్రాధాన్యత సంతరించుకుంది.