Thursday, March 28, 2024
Homeస్పోర్ట్స్శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం

శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం

ఆస్ట్రేలియా మరోసారి సత్తా చాటింది. టి20 వరల్డ్ కప్ లో  శ్రీలంకపై ఏడువికెట్లతో ఘనవిజయం సాధించింది. సూపర్ 12లో వరుసగా రెండో విజయాన్ని ఆసీస్ నమోదు చేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

లంక ఓపెనర్ నిశాంక ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కుశాల్ పెరీరా, చరిత్ అసలంక  రెండో వికెట్ కు 63 పరుగులు జోడించారు. అసీస్ బౌలర్ జంపా పదో ఓవర్లో వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. చరిత్ అసలంక  27 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ తో 35 పరుగులు ఔటయ్యాడు. మరుసటి ఓవర్లోనే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో పెరీరా-35 (25 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్) బౌల్డ్ అయ్యాడు. జంపా, స్టార్క్ లు తమ తర్వాతి ఓవర్లలో వరుసగా ఫెర్నాండో(4), హసరంగ(4) లను అవుట్ చేశారు. ఈ దశలో భానుక రాజపక్ష, కెప్టెన్ షనుక లు ఏడో వికెట్ కు 40 పరుగులు జోడించారు. నిర్ణీత 20 ఓవర్లలో లంక ఆరు వికెట్లకు 156  పరుగులు చేసింది. రాజపక్ష 33 (26 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్) పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఆస్ట్రేలియా దూకుడుగా ఆట మొదలుపెట్టింది. ఓపెనర్లు వార్నర్, పించ్ లు తొలి వికెట్ కు 6.5 ఓవర్లలో 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. పించ్ 37 (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి ఔటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన గ్లెన్ మ్యాక్స్ వెల్ ఐదు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ దశలో స్మిత్, వార్నర్ మూడో వికెట్ కు 50 పరుగులు జోడించారు. వార్నర్ 42 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు చేసి లంక కెప్టెన్ షనక బౌలింగ్ లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన స్టోనిస్-16 నాటౌట్ (ఏడు బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్) దూకుడుగా ఆడడంతో ఆసీస్ 17 ఓవర్లలోనే 155 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకొంది. స్టీవ్ స్మిత్ 26 బంతుల్లో ఒక ఫోర్ తో 28 పరుగులతో అజేయంగా నిలిచారు.

రెండు కీలక వికెట్లు తీసిన జంపాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్