Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్నెదర్లాండ్స్ పై నమీబియా విజయం

నెదర్లాండ్స్ పై నమీబియా విజయం

ఐసిసి టి-20 పురుషుల వరల్డ్ కప్ టోర్నీలో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై నమీబియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అబుదాబీలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

నెదర్లాండ్స్ ఓపెనర్ మ్యాక్స్ డౌడ్ 56 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సర్ తో 70; కొలిన్ అకేర్మాన్-35; స్కాట్ ఎడ్వర్డ్స్- 21; స్టీఫెన్ మైబర్గ్-17 పరుగులతో రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రైలింక్ రెండు. డేవిడ్ వీస్ ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన 52 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ గెతార్డ్ ఎరాస్మస్- డేవిడ్ వీస్ లు నాలుగో వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గెతార్డ్-32; డేవిడ్ వీస్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనితో నమీబియా 19 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

డేవిడ్ వీస్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్