Sunday, January 19, 2025
HomeTrending Newsజన సున్నా పార్టీ: ఇప్పడు కలవడం కాదు.. వాళ్లిద్దరూ ఎప్పుడూ ఒక్కటే

జన సున్నా పార్టీ: ఇప్పడు కలవడం కాదు.. వాళ్లిద్దరూ ఎప్పుడూ ఒక్కటే

నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబునాయుడు జైల్లో ఉన్నారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. కొంత ఆలస్యం అయినా నిజమే ఎప్పటికైనా గెలుస్తుందని, రెండెకరాలతో మొదలైన చంద్రబాబు రెండు లక్షల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. నారా భువనేశ్వరి నేటి నుంచి చేపడుతోన్న ‘నిజం గెలవాలి’ యాత్రపై నాని స్పందించారు. ఆమె నడుపుతోన్న హెరిటేజ్ సంస్థ కూడా అవినీతి డబ్బుతోనే బాబు స్థాపించారని అన్నారు.  బాబు అధికారంలో ఉంటే ఈ కంపెనీ లాభాల్లో ఉంటుందని, లేకపోతే నష్టాల్లో ఉంటుందని అన్నారు.

ఈ 45 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టారని, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని…  ఒకవేళ నిజం గెలిస్తే కనీసం 30 లక్షలు ఖర్చు పెట్టి ఉండేవారా…కష్టపడిన సొమ్ముతోనే 7 కోట్లు ఖర్చు పెట్టి బస్సు కొని ఈ యాత్ర చేస్తునారా అంటూ నాని ప్రశ్నించారు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలని బలంగా అనుకుంటే బాబు ఎప్పటికీ జైలు నుంచి బైటికి రాలేరని స్పష్టం చేశారు. లోకేష్ సమర్దుడైతే ఆయన ఇంట్లో ఉన్న తల్లి, భార్య బైటకు రావాల్సిన అవసరం ఏమిటని, రెడ్ బుక్ లో పేరు రాసుకున్నానంటూ సొల్లు కబుర్లు చెప్పిన ఆయన ఢిల్లీ ఎందుకు పారిపోయారని నిలదీశారు.

చంద్రబాబు- పవన్ కళ్యాణ్ లు ఎప్పుడూ కలిసే ఉన్నారని, 2014 లో ఉమ్మడిగానే పోటీ చేశారని గుర్తు చేశారు. బాబుకు ఎప్పుడు అవసరమైతే దానికి అనుగుణంగా పవన్ యాక్షన్ చేస్తారని, అది జన సున్నా పార్టీ అంటూ అభివర్ణించారు. పవన్ పార్టీ పెట్టిందే చంద్రబాబు వద్ద ప్యాకేజ్ తీసుకుని ఆయనకు అనుగుణంగా వ్యవహరిస్తారని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్