Sunday, January 19, 2025
Homeసినిమాచరణ్‌ తో నటిస్తే.. పెళ్లైపోతుందా..?

చరణ్‌ తో నటిస్తే.. పెళ్లైపోతుందా..?

రామ్ చరణ్‌ తో కలిసి నటిస్తే.. ఆ హీరోయిన్ కి తర్వాత పెళ్లైపోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. చరణ్ కు జంటగా ఆలియా భట్ నటించింది. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అయితే.. ఈ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఆలియా పెళ్లి జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ని పెళ్లాడింది ఆలియా. ఆ వెంటనే రణబీర్, అలియా దంపతులకు ఓ పాప కూడా పుట్టింది.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ పాట చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. సమ్మర్ కి వస్తుంది అనుకున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఇప్పుడు కైరా అద్వానీ తన బాయ్ ఫ్రెండ్, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడింది.  జైసల్మార్ లోని ఒక ప్యాలెస్ లో హిందూ సంప్రదాయ పద్ధతిలో కైరా, సిద్దార్థ్ మల్హోత్రా వివాహం జరిగింది.

సో.. అలియా లాగే కైరాకి కూడా చరణ్ సరసన నటించగానే పెళ్లి ఘడియలు వచ్చేశాయి. రామ్ చరణ్ పై త్వరలోనే శంకర్ ఒక పాట చిత్రీకరించనున్నారు. ఈ పాటలో మాత్రం ఆమె నటించబోవడం లేదు. ఆ తర్వాత షెడ్యూల్ లో పాల్గొంటుంది. ఎందుకంటే.. పెళ్లి, రిసెప్షన్, హనీమూన్ వంటి కార్యక్రమాలతోనే ఈ నెల అంతా గడిచిపోతుంది ఆమెకి. నిజానికి, కైరా అద్వానీ కానీ, అలియా కానీ రామ్ చరణ్ తో నటించడానికి, వారి పెళ్ళికి ఈ సంబంధం లేదు కానీ.. యాదృచ్చికంగా అతనితో నటించగానే వారి పెళ్లి జరిగింది అంతే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్