Sunday, January 19, 2025
Homeసినిమాచిరుతో అనుకుంటే.. నితిన్ తో సెట్ అయ్యిందా..?

చిరుతో అనుకుంటే.. నితిన్ తో సెట్ అయ్యిందా..?

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుంటే.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ మూవీని దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు కానీ.. కొంత మంది డైరెక్టర్స్ చిరు కోసం కథలు రెడీ చేస్తున్నారు.

‘ఛ‌లో’, ‘భీష్మ’ చిత్రాల‌తో ఆక‌ట్టుకుని సక్సెస్ సాధించిన వెంకీ కుడుముల‌ చిరంజీవితో సినిమా చేయాలి అనుకున్నారు. చిరంజీవి కోసం కథ రాయడం.. ఆయనకు చెప్పడం జరిగింది. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. చిరంజీవి వేరే.. వేరే క‌థ‌లు విన‌డంతో, ప్రాజెక్టు ఆల‌స్యం అయిపోవ‌డంతో… వెంకీ మ‌రో ఆప్ష‌న్ వెదుక్కొన్నాడు. మ‌ళ్లీ నితిన్‌తోనే సినిమా ఓకే చేసుకొన్నాడు వెంకీ.

ఇటీవ‌లే… నితిన్‌కి వెంకీ కుడముల క‌థ చెప్ప‌డం, అది నితిన్‌కి న‌చ్చ‌డం జ‌రిగిపోయాయి. ఈమ‌ధ్యే ఈ సినిమా కోసం నితిన్‌ పై ఓ ఫొటో షూట్ కూడా చేశారు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఈ వారం లోనే బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. నితిన్ ప్ర‌స్తుతం వ‌క్కంతం వంశీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. వ‌క్కంతం వంశీ సినిమాతో పాటుగా స‌మాంత‌రంగా ఈ సినిమానీ పూర్తి చేస్తాడు నితిన్‌. ఆఖరికి వెంకీ కుడుముల చిరంజీవితో సినిమా చేయాలి అనుకుంటే.. నితిన్ తో సెట్ అయ్యింది అన్నమాట.

RELATED ARTICLES

Most Popular

న్యూస్