Friday, October 18, 2024
HomeసినిమాSimhadri Re Release: రీ రిలీజ్ లో సంచలనం ఎన్టీఆర్ 'సింహాద్రి'

Simhadri Re Release: రీ రిలీజ్ లో సంచలనం ఎన్టీఆర్ ‘సింహాద్రి’

టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. తమ అభిమాన కథానాయకుడు నటించిన పాత చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయడం… ఆ పాత మధురాలను గుర్తుచేసుకోవడం అనేది ట్రెండ్ గా మారింది. అంతే కాకుండా ఇలా రీ రిలీజ్ చేసిన సినిమాల ద్వారా వచ్చిన మొత్తానికి ఓ మంచి పని కోసం ఉపయోగిస్తుండడం అభినందనీయం. అసలు ఈ ట్రెండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో మొదలైంది. పోకిరి సినిమాను రీ రిలీజ్ చేస్తే.. అనూహ్యమైన స్పందన వచ్చింది. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.

పోకిరి తర్వాత జల్సా, ఖుషి, చెన్నకేశవరెడ్డి, ఆరెంజ్, దేశముదురు చిత్రాలను రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సంద‌డిలో భాగం అయ్యేందుకు భారీగానే స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కొన్ని రీ రిలీజ్ అయినా.. వాటికి స‌రైన ప్లానింగ్, ప్ర‌మోష‌న్ చేయలేదు. అయితే.. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సింహాద్రి సినిమాను తెలుగు రాష్ట్రాల్లోనే కాక వ‌ర‌ల్డ్ వైడ్ తెలుగు వాళ్లున్న చాలా చోట్ల భారీగా షోలు ప్లాన్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో అయితే.. సింహాద్రి విడుద‌ల‌కు నెల రోజుల ముందే అక్క‌డ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అప్పుడే ప్రి సేల్స్ ద్వారా 4 వేల డాల‌ర్ల దాకా వ‌సూళ్లు న‌మోదైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

అంతే కాకుండా  ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన ఐమాక్స్ స్క్రీన్లో సింహాద్రి 4కే షో ప‌డుతుండ‌టం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. మే 20న మెల్‌బోర్న్‌లోని భారీ ఐమాక్స్ థియేట‌ర్లో ఈ చిత్రానికి టాలీ మూవీస్ సంస్థ స్పెష‌ల్ షో ప్లాన్ చేసింది. అంత బిగ్ స్క్రీన్‌ ను 20 ఏళ్ల కింద‌టి సినిమాకు కేటాయించ‌డం అంటే విశేషం. మొత్తానికి సింహాద్రి రీ రిలీజ్ విషయంలో సంచలనం సృష్టించింది. మరి… సింహాద్రి రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్