Sunday, January 19, 2025
Homeసినిమా'వీర‌మ‌ల్లు'కు మ‌ళ్లీ బ్రేక్... టెన్ష‌న్ లో టీమ్?

‘వీర‌మ‌ల్లు’కు మ‌ళ్లీ బ్రేక్… టెన్ష‌న్ లో టీమ్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్  నటిస్తోన్న తాజా చిత్రం ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’.  క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తోన్న ఈ భారీ చిత్రాన్ని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్  ఏఎం ర‌త్నం నిర్మిస్తున్నారు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డంతో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఏ ముహుర్తాన ఈ సినిమాను స్టార్ట్ చేశారో కానీ.. షూటింగ్ స్టార్ట్ చేసిన‌ప్పటి నుంచి అడ్డంకులు వ‌స్తూనే ఉన్నాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లో బిజీ కావ‌డంతో ఇటీవల షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. అక్టోబ‌ర్ నుంచి ఏపీ టూర్ ఉండ‌డంతో ప‌వ‌న్ అక్టోబ‌ర్ లోపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోమ‌ని చెప్పారు. ఆగ‌ష్టు 11 నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై యాక్ష‌న్ సీన్స్, ఓ సాంగ్ షూట్ చేయాలి అనుకున్నారు. అంతా రెడీ చేసుకుంటున్నారు. ఈసారి వీర‌మ‌ల్లు షూటింగ్ కంప్లీట్ అవుతుంద‌నే ధీమాతో ఉన్నారు మేక‌ర్స్.

అయితే.. ఇప్పుడు నిర్మాత‌లు  ఆగ‌ష్టు 1 నుంచి షూటింగులు బంద్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో మ‌రోసారి వీర‌మ‌ల్లు షూటింగ్ కి బ్రేక్ ప‌డ‌బోతుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఆగ‌ష్టు 11 లోపు నిర్మాత‌లు త‌మ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గం క‌నుక్కుని య‌ధావిథిగా షూటింగులు స్టార్ట్ చేస్తే ఫ‌ర‌వాలేదు. అలా కాకుండా ఆగ‌ష్టు 11 త‌ర్వాత కూడా బంద్ కంటిన్యూ అయితే.. వీర‌మ‌ల్లుకు క‌ష్ట‌మే. అందుక‌నే టీమ్ టెన్షన్ ప‌డుతుంద‌ట‌. మ‌రి.. ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.

Also Read : ఆగ‌ష్టు 1 నుంచి షూటింగ్ లు బంద్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్