Sunday, January 19, 2025
Homeసినిమా వారియ‌ర్ ఎఫెక్ట్.. మార్పులు చేస్తున్న బోయ‌పాటి

 వారియ‌ర్ ఎఫెక్ట్.. మార్పులు చేస్తున్న బోయ‌పాటి

ఎనర్జిటిక్  స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ వారియర్. లింగుస్వామి డైరెక్ష‌న్ లో రూపొందిన వారియ‌ర్ మూవీ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన వారియ‌ర్ స‌క్సెస్ అవుతుంద‌ని రామ్ ఆశ‌లు పెట్టుకున్నాడు. అయితే.. రొటీన్ స్టోరీ కావ‌డంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఈ మూవీ త‌ర్వాత రామ్ ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి డైరెక్ష‌న్ లో మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించి స్టోరీ కూడా లాక్ అయ్యింది.

అయితే.. వారియ‌ర్ రిజెల్ట్ తో బోయపాటి శ్రీను పై ఒత్తిడి మొదలైంద‌ని..  టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని టాక్ వినిపిస్తుంది. బోయపాటి అఖండ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చేసారు. 100 కోట్ల వసూళ్లతో అఖండని బాలయ్య కెరీర్ కి మరో మైల్ స్టోన్ మూవీగా అందించారు. సింహా, లెజెండ్ తర్వాత అఖండతో హ్యాట్రిక్ అందుకున్న ద్వయంగా టాలీవుడ్ చరిత్రలో నిలిచారు. ఈ నేపథ్యంలో  త్వరలో రామ్ తో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.వారియర్  హిట్ అయితే రెట్టించిన‌ ఉత్సాహంలో అదే ఊపును కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోవాలని బోయపాటి ప్లాన్ చేసుకున్నారు. అయితే.. వారియర్ ఫలితంతో బోయపాటి కథలో మార్పులు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కీల‌క  మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో నిజ‌మెంతో తెలియ‌దు కానీ.. ప్ర‌చారం మాత్రం జ‌రుగుతుంది. మ‌రి.. బోయ‌పాటి అయినా రామ్ కి ఆశించిన విజ‌యాన్ని అందిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్