రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పల్లెలు, పట్టణాలలో పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకుంటోంది. వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిటలాడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాలు, నగరాల్లోనూ అన్నివర్గాల ప్రజలూ ఎక్కువ సంఖ్యలో తమ ఓటు నమోదు చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఉదయం11 గంటలకే దాదాపు 25% పోలింగ్ నమోదుకాగా, మధ్యాహ్నం 3 గంటలకు అది 55.49 శాతానికి చేరింది. దైంది.
కాగా, 2019 ఎన్నికల్లో 79.74 శాతం ఓటింగ్ నమోదైంది. ఎక్కువశాతం నమోదైతే అది సహజంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుందని తెలుగుదేశం, జనసేన, బిజెపి నేతలు భావిస్తున్నారు. ఈసారి కచ్చితంగా 85 శాతం వరకూ నమోదవుతుందని వారు అంచనా వేస్తున్నారు. దీనితో కూటమి నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. తాము ఊహించిన దానికంటే ట్రెండ్స్ పాజిటివ్ గా ఉన్నాయని, భారీ మెజార్టీతో తాము విజయం సాదించబోతున్నామని వారు ధీమాగా ఉన్నారు.