Sunday, January 19, 2025
Homeసినిమా'అమిగోస్' బ్యూటీకి పెరుగుతున్న డిమాండ్!

‘అమిగోస్’ బ్యూటీకి పెరుగుతున్న డిమాండ్!

టాలీవుడ్ కి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతున్నారు. గ్లామర్ తో పాటు కాస్త టాలెంట్ ఉంటే చాలు,ప్రేక్షకులు ఆదరించేస్తున్నారు. వరుస ఆఫర్లతో ఆ భామలు తెలుగు తెరను ఏలేస్తున్నారు. కృతి శెట్టి .. శ్రీలీల వంటివారు మొదటి సినిమా రిలీజ్ కాకముందే మూడేసి సినిమాల్లో ఛాన్సులు కొట్టేశారు. అదే విధంగా ఆషిక రంగనాథ్ కూడా పోస్టర్స్ తోనే ఇక్కడి కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టేసిందనీ .. మేకర్స్ దృష్టిని ఆకర్షించిందని చెప్పచ్చు.

కల్యాణ్ రామ్ హీరోగా ‘అమిగోస్’ సినిమా రూపొందింది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోనే ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటల్లో అమ్మడి గ్లామర్ మంచి మార్కులు కొట్టేసింది. చక్కని కనుముక్కుతీరుతో యూత్ హృదయాలను కొల్లగొట్టేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సుందరిని వెతుక్కుంటూ వరుస ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు.

నాని .. నితిన్ ..  రామ్ .. నాగశౌర్య వంటి యంగ్ హీరోల తదుపరి ప్రాజెక్టుల నుంచి ఆషికకి అవకాశాలు వస్తున్నాయనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఈ హీరోల కొత్త ప్రాజెక్టుల జాబితాలో ఆమె పేరు వినిపించడం ఖాయమని అనుకుంటున్నారు. పూజ హెగ్డే .. రష్మిక .. కీర్తి సురేశ్ వంటి హీరోయిన్స్ ముందువరుసలో ఉంటే, కృతి శెట్టి .. శ్రీలీల ఆ తరువాత వరుసలో ఉన్నారు. ఆ ఇద్దరి తరువాత స్థానంలో ఈ ముద్దుగుమ్మ చేరనుందనే అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి. ఆషిక అదృష్టం ఎలా ఉందనేది చూడాలి మరి!

Also Read : ‘అమిగోస్’ తో పరిచయమవుతున్న అందాల రాశి! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్