Saturday, June 6, 2026
Homeస్పోర్ట్స్Women Hockey WC: రెండో మ్యాచ్ లోనూ  ఇండియా డ్రా

Women Hockey WC: రెండో మ్యాచ్ లోనూ  ఇండియా డ్రా

ఎఫ్ ఐ హెచ్ ఆధ్వర్యంలో జరుగుతోన్న హాకీ మహిళల వరల్డ్ కప్ లో ఇండియా ఆడిన రెండో మ్యాచ్ కూడా డ్రా గా ముగిసింది. చైనాతో జరిగిన ఈ మ్యాచ్  నిర్ణీత సమయం పూర్తయ్యే నాటికి 1-1తో స్కోరు సమం అయ్యింది. దీనితో పూల్ ‘బి’ లో రెండు పాయింట్లతో ఇండియా  మూడో స్థానంలో నిలిచింది.

నెదర్లాండ్స్ లోని  అమ్ స్టేల్వీన్ వాగ్నర్ హాకీ స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో 26వ నిమిషంలో చైనా క్రీడాకారిణి ఝెంగ్ జియాలీ ఫీల్డ్ గోల్ ద్వారా స్కోరు బోణీ కొట్టింది. 45వ నిమిషంలో ఇండియా ప్లేయర్ వందన కటారియా పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి ఇండియాకు పాయింట్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మరో గోల్ సాధించడంలో ఇరు జట్లూ విఫలమయ్యాయి.

ఇండియా తన తొలి మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లాండ్ తో ఆడగా అది కూడా డ్రాగా నే ముగిసిన సంగతి తెలిసిందే. తన తర్వాతి మ్యాచ్ ను న్యూజిలాండ్ తో ఎల్లుండి జూలై 7న ఇండియా జట్టు ఆడనుంది.

Also Read : ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular