Saturday, June 13, 2026
Homeస్పోర్ట్స్ప్రో లీగ్ హాకీ: జర్మనీ పై ఇండియా రెండో విజయం

ప్రో లీగ్ హాకీ: జర్మనీ పై ఇండియా రెండో విజయం

FIH Pro-league: ప్రో లీగ్ హాకీలో ఇండియా జోరు కొనసాగుతోంది. జర్మనీ పై నిన్న 3-0 ఆధిక్యంతో గెలిచిన ఇండియా నేటి రెండో మ్యాచ్ లోనూ ­3-1తో విజయం సాధించింది. 2021-22 పురుషుల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ లో భాగంగా ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో 19వ నిమిషంలో సుఖ్ జీత్ సింగ్ ఫీల్డ్ గోల్ ద్వారా ఇండియాకు తొలి గోల్  నమోదు చేశాడు. 41వ నిమిషంలో వరుణ్ కుమార్ పెనాల్టీ కార్నర్ ద్వారా రెండో గోల్ అందించాడు. అయితే 45వ నిమిషంలో జర్మనీ ఆటగాడు బొకేల్ అంటోన్ ఫీల్డ్ గోల్ చేసి స్కోరును ­2-1కి చేర్చాడు. 54వ నిమిషంలో ఇండియాకు అభిషేక్ మరో ఫీల్డ్ గోల్ అందించడంతో మళ్ళీ ఆధిక్యం 3-1కి పెరిగింది. పూర్తి సమయం నాటికి జర్మనీ గోల్ చేయలేకపోవడంతో 3-1తో ఇండియా గెలుపు సొంతం చేసుకుంది.

ఈ విజయంతో 27 పాయింట్లతో ఇండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, జర్మనీ-17, నెదర్లాండ్స్-16 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఇండియా తన తర్వాతి మ్యాచ్ లను జూన్ 11,12 తేదీల్లో బెల్జియంతోను(వేదిక-ఆంట్వెర్ప్-బెల్గియం)

జూన్ 18,19 తేదీల్లో నెదర్లాండ్స్ తోను (వేదిక-హాజెలార్వెగ్, రోటర్ డాం-నెదర్లాండ్స్) ఆడనుంది.

Also Read : ప్రో లీగ్ హాకీ: ఇండియా జోరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular