Tuesday, June 9, 2026
Homeస్పోర్ట్స్ప్రో లీగ్ హాకీ: బెల్జియంపై ఇండియా షూటౌట్

ప్రో లీగ్ హాకీ: బెల్జియంపై ఇండియా షూటౌట్

FIH Pro-league: ప్రో లీగ్ హాకీలో ఇండియా పురుషుల జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నేడు బెల్జియంతో జరిగిన మ్యాచ్ లో సడన్ డెత్ లో ఒక గోల్ తేడాతో విజయం దక్కించుకుంది.

బెల్జియం లోని అంట్వేర్ప్ లో జరిగిన ఈ మ్యాచ్ రెగ్యులర్ టైమ్ లో ఇరు జట్లూ మూడేసి గోల్స్ సాధించడంతో షూటౌట్ కు వెళ్ళాల్సి వచ్చింది. దీనిలో బెల్జియం నాలుగు గోల్స్ చేయగా, ఇండియా ఐదు గోల్స్ చేసి ఉత్కంఠ విజయం దక్కించుకుంది.

అంతకుముందు మ్యాచ్ లో 18వ నిమిషం వద్ద గోల్ కీపర్ విన్సెంట్ ఇండియాకు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 21, 36, 51 నిమిషాల్లో మూడు గోల్స్ సాధించిన బెల్జియం ఆధిక్యంలోకి వెళ్ళింది. అయితే 52వ నిమిషంలో నికోలస్ పెనాల్టీ స్ట్రోక్ ద్వారా, 58వ నిమిషంలో డారెన్ ఆర్థర్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్స్ అందించి స్కోరు సమం చేశారు.

రేపు ఇదే వేదికగా ఈ రెండు జట్లూ మరోసారి తలపడనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular