Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్థామస్ కప్: కెనడాపై ఇండియా గెలుపు

థామస్ కప్: కెనడాపై ఇండియా గెలుపు

Thomas Cup: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్వర్యంలో జరుతుతోన్న టోటల్ ఇంజనీర్స్ థామస్ ఉబెర్ కప్ ఫైనల్స్ -2022లో భాగంగా నేడు ఇండియా-కెనడా పురుషుల జట్లు తలపడ్డాయి.  ఇండియా కెనడాను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది.  నిన్న జర్మనీ తో జరిగిన మ్యాచ్ ను సైతం ఇండియా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

సింగిల్స్ విభాగంలో

  • కిడాంబి శ్రీకాంత్ 20-22; 21-11; 21-15 తేడాతో బ్రియాన్ యంగ్
  • హెచ్ ఎస్ ప్రన్నోయ్ 21-15; 21-12 తో బి. ఆర్. సంకీర్త్
  • ప్రియంషు రాజవత్ 21-14; 20-22; 21-13 తో విక్టర్ లై పై……. విజయం సాధించారు

డబుల్స్ విభాగంలో

  • సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ 21-12;21-11తో జేసన్ ఆంటోనీ-కెవిన్ ద్వయంపై…
  • కృష్ణ ప్రసాద్ గరగ – విష్ణువర్ధన్ గౌడ్ పంజాల ద్వయం 21-15;21-11తో డాంగ్ ఆడమ్-నైల్ యకురా జంటపై విజయం సాధించారు

గ్రూప్ సి విభాగం నుంచి ఇప్పటికే క్వార్టర్స్ కు చేరుకున్న ఇండియా జట్టు ఎల్లుండి 11వ తేదీన చైనీస్ తైపీ జట్టుతో తలపడనుంది.  చైనీస్ కూడా క్వార్టర్స్ కు చేరుకోవడం గమనార్హం.

Also Read : థామస్ అండ్ ఉబెర్ క్వార్టర్స్ లో ఇండియా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్