Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రో లీగ్ హాకీ: ఇంగ్లాండ్ పై ఇండియా విజయం

ప్రో లీగ్ హాకీ: ఇంగ్లాండ్ పై ఇండియా విజయం

FIH Pro-league: 2021-22 పురుషుల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ లో భాగంగా ఇంగ్లాండ్ తో నేడు జరిగిన రెండో రెండో మ్యాచ్ లో ఇండియా 4-3తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో ఇండియా షూటౌట్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 7వ నిమిషంలో ఇంగ్లాండ్ తొలి గోల్ (శాన్ ఫోర్డ్ లియాన్) సాధించగా, 15వ నిమిషంలో లభించిన ఎక్స్ ట్రా టైం లో ఇండియా తొలి గోల్ (మన్ ప్రీత్ సింగ్) నమోదు చేసింది. ఇండియా 26వ నిమిషంలో రెండు గోల్స్(హార్మన్ ప్రీత్, మన్ ప్రీత్) సాధించి అర్ధ భాగానికి 3-1 ఆధిక్యం సంపాదించింది.

ఇంగ్లాండ్ 39వ నిమిషంలో మరో గోల్  చేసి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించింది. 43వ నిమిషంలో ఇండియా కు హర్మన్ ప్రీత్ మరో గోల్ సాధించి మళ్ళీ ఆధిక్యాన్ని 4-2కు పెంచాడు. ఆ మరుసటి నిమిషంలోనే ఇంగ్లాండ్ ఆటగాడు వార్డ్ సామ్ గోల్ సాధించి ఆధిక్యాన్ని 4-3కు తగ్గించాడు. తర్వాత రెండు జట్లూ  గోల్స్ సాధించలేకపోవడంతో ఇండియా 4-3తో విజయం సాధించింది.

ఈ గెలుపుతో ఇండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికి 10 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించగా, రెండు  మ్యాచ్ఓ లలో ఓటమి పాలైంది. మరో రెండు మ్యాచ్ లు షూటౌట్ కాగా వాటిలో ఒకదానిలో విజయం, మరో దానిలో పరాజయంతో మొత్తం 21 పాయింట్లు సంపాదించింది.

Also Read : ప్రో లీగ్ హాకీ: ఇంగ్లాండ్ పై ఇండియా సడన్ డెత్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్