Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్T20 World Cup: ఐర్లాండ్ పై ఇండియా ఘనవిజయం

T20 World Cup: ఐర్లాండ్ పై ఇండియా ఘనవిజయం

టి20 వరల్డ్ కప్ లో ఇండియా తన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.  భారత బౌలర్లు సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ కాగా, ఈ లక్ష్యాన్ని ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 12.2 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు సాధించి గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. రిషభ్ పంత్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ (1); సూర్య కుమార్ యాదవ్ (2) విఫలమయ్యారు.

న్యూ యార్క్ లోని నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. ఐర్లాండ్ జట్టులో దేలానీ ఒక్కడే 26  పరుగులతో రాణించాడు. మిగిలిన వారు విఫలం కావడంతో జట్టు కేవలం 96 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3; అర్ష్ దీప్ సింగ్, బుమ్రా చెరో 2; సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.

మూడు ఓవర్లలో కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రాకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

ఆదివారం ఇదే స్టేడియంలో దాయాదులు ఇండియా-పాకిస్తాన్ తలపడున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్