Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్చివరి లీగ్ మ్యాచ్ లోనూ ఇండియా విజయం

చివరి లీగ్ మ్యాచ్ లోనూ ఇండియా విజయం

India beat Japan:

ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2021 పురుషుల హాకీ టోర్నమెంట్ లో ఇండియా చివరి లీగ్ మ్యాచ్ లో జపాన్ పై 6-0తో ఘన విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్ చేరిన ఇండియా ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

నేటి మ్యాచ్ లో ఇండియా సాధించిన గోల్స్ వివరాలు….

  1. 10వ నిమిషంలో హర్మన్ ప్రీత్ పెనాల్టీ కార్నర్ ద్వారా మొదటి గోల్
  2. 23వ నిమిషంలో దిల్ ప్రీత్ సింగ్ రెండో గోల్
  3. 34వ నిమిషంలో జర్మన్ ప్రీత్ సింగ్ మూడో గోల్
  4. 46వ నిమిషంలో సుమిత్ నాలుగో గోల్
  5. 53వ నిమిషంలో హర్మన్ ప్రీత్ పెనాల్టీ కార్నర్ ద్వారా మరో గోల్ (ఐదవది )
  6. 54వ నిమిషంలో షంషేర్ సింగ్ ఆరో గోల్ సాధించారు.

బంగ్లాదేశ్ రాజధాని ధాకాలో జరుతుతోన్న ఈ టోర్నీలో మొత్తం ఆరు దేశాలు పాల్గొనాల్సి ఉండగా మలేషియా చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలిగింది. దీనితో ఐదు జట్లు… ఇండియా, పాకిస్తాన్, కొరియా, జపాన్, బంగ్లాదేశ్ పాల్గొన్నాయి. ఇండియా తానూ ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఒకటి డ్రాగా  ముగియగా మిగిలిన మూడు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది.

  1. మొదటి మ్యాచ్ కొరియాపై తొలి మ్యాచ్ ­2-2తో డ్రా
  2. రెండో మ్యాచ్ లో 9-0 తేడాతో బంగ్లాదేశ్ పై
  3. మూడో మ్యాచ్ లో 3-1 తేడాతో పాకిస్తాన్ పై
  4. నేడు జరిగిన నాలుగో మ్యాచ్ లో జపాన్ పై 6-0 తేడాతో విజయం సాధించింది.

ఎల్లుండి మంగళవారం జరగనున్న సెమీఫైనల్లో ఇండియా ఎవరితో ఆడనుందో మరి కాసేపట్లో తేలనుంది.

డిసెంబర్ 14 న మొదలైన ఈ టోర్నీ 22 న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.

Also Read : పాక్ పై విజయం : సెమీస్ లో ఇండియా

RELATED ARTICLES

Most Popular

న్యూస్