Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్Ind Vs NZ: భారత బౌలింగ్ ధాటికి కివీస్ విలవిల- ఇండియాదే రెండో వన్డే

Ind Vs NZ: భారత బౌలింగ్ ధాటికి కివీస్ విలవిల- ఇండియాదే రెండో వన్డే

న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో ఇండియా 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మ్యాచ్ లో పాటు మూడు వన్డేల సిరీస్ ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.

రాయపూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  భారత  బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటింగ్ లైనప్ కుప్ప కూలింది. 15  పరుగులకే 5  వికెట్లు కోల్పోయిన దశలో గ్లెన్ ఫిలిప్స్-36; శాంట్నర్ 27; బ్రేస్ వెల్ 22 మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 34.3 ఓవర్లలో 108 పరుగులకు కివీస్ ఆలౌట్ అయ్యింది.

ఇండియా బౌలర్లలో షమి-౩; హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో 2; సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఈ లక్ష్యాన్ని ఇండియా 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్-51; విరాట్ -11 పరుగులు చేసి ఔట్ కాగా, శుభ్ మన్ గిల్ -40; ఇషాన్ కిషన్ -8 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

మహమ్మద్ షమి కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్