Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్2022–23 Men's FIH Pro League: ఆరంభ మ్యాచ్ లో ఇండియా విజయం

2022–23 Men’s FIH Pro League: ఆరంభ మ్యాచ్ లో ఇండియా విజయం

ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో నిర్వహించే  పురుషుల ప్రోలీగ్ టోర్నమెంట్ 2022-23 సీజన్ నేడు ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో ఆరంభమైంది. తొలి మ్యాచ్ లో  న్యూజిలాండ్ పై ఇండియా 4-3తేడాతో విజయం సాధించింది.

ఆట 14 వ నిమిషంలో ఇండియా తొలి గోల్ (ఫీల్డ్) సాధించింది, 25, 35,36 నిమిషాల్లో కివీస్ జట్టు పెనాల్టీ స్ట్రోక్, ఫీల్డ్ గోల్, పెనాల్టీ కార్నర్ గోల్స్ చేసి 3-1 ఆధిక్యంలోకి వెళ్ళింది. 42వ నిమిషంలో ఇండియా పెనాల్టీ స్ట్రోక్ గోల్ ద్వారా స్కోరును 3-2కు తగ్గించింది.

అయితే చివరి పావు భాగంలో 52వ నిమిషంలో మన్ దీప్ సింగ్ అందించిన అద్భుతమైన ఫీల్డ్ గోల్ తో స్కోరును 3-3తో ఇండియా సమం చేసింది. 57 వ నిమిషంలో మన్ దీప్ మరోసారి సత్తా చాటి వేగంగా స్పందించి మరో ఫీల్డ్ గోల్ చేసి ఇండియా విజయం ఖాయం చేశాడు. చివరి మూడు నిమిషాల్లో గోల్ సాధించేందుకు న్యూజిలాండ్ జట్టు తీవ్రంగా శ్రమించినా ఇండియా డిఫెండర్లు గట్టిగా అడ్డుకున్నారు.

మన్ దీప్ మొత్తం మూడు గోల్స్ సాధించాడు. ఎల్లుండి ఇదే స్టేడియంలో ఇండియా స్పెయిన్ తో తలపడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్