Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఎఫ్.ఐ.హెచ్. మహిళా హాకీ: స్పెయిన్ పై ఇండియా గెలుపు

ఎఫ్.ఐ.హెచ్. మహిళా హాకీ: స్పెయిన్ పై ఇండియా గెలుపు

India beat Spain: 2021-22 మహిళల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ మ్యాచ్ లో  నేడు ఇండియా 2-1తో స్పెయిన్ ను ఓడించింది. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ లో ఇది 13వ మ్యాచ్.  ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలి పావు భాగంలో ఎవరూ గోల్ సాధించాలేకపోయారు, రెండవ పావు భాగం 18వ నిమిషంలో స్పెయిన్ మొదటి గోల్ చేసి బోణీ చేసింది. ఆ కాసేపటికే ఇండియా తరఫున జ్యోతి ఫీల్డ్ గోల్ చేసి స్కోరు సమం చేసింది. ఆట మూడో పావు భాగంలో రెండు జట్లూ గోల్ చేయలేకపోయాయి. ఆట చివరి భాగంలో ­52వ నిమిషం వద్ద క్రీడాకారిణి నేహ ఇండియాకు రెండో గోల్ అందించి జట్టును ఆధిక్యంలో నిలిపింది, ఆ తర్వాత స్పెయిన్ మరో గోల్ చేయకుండా ఇండియా నిలువరించగలిగింది.

ఈ టోర్నీలో ఇప్పటికి మూడు మ్యాచ్ లు ఆడిన ఇండియా మహిళా జట్టు అన్నింటిలోనూ విజయం సాధించింది.  రేపు  ఇదే వేదికగా స్పెయిన్ తో రెండో మ్యాచ్ ను కూడా ఇండియా ఆడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్