Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్IND Vs. SL: వన్డే సిరీస్ కూడా ఇండియాదే

IND Vs. SL: వన్డే సిరీస్ కూడా ఇండియాదే

శ్రీలంకతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన రెండో మ్యాచ్ లో ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకుంది. యజువేంద్ర చాహల్ స్థానంలో జట్టులోకి వచ్చిన కులదీప్ యాదవ్ మూడు వికెట్లతో రాణించి ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ గెల్చుకున్నాడు. గత వారం జరిగిన టి 20 సిరీస్ ను 2-1తో ఇండియా గెల్చుకున్న సంగతి తెలిసిందే.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా బౌలింగ్ ధాటికి వేగంగా పరుగులు తీయడంలో లంక ఆటగాళ్ళు విఫలమయ్యారు. ఫెర్నాండో-50; కుశాల్ మెండీస్-34; వేల్లలగే-32 పరుగులు చేశారు. దీనితో 39.4 ఓవర్లలో 215 పరుగులకే లంక ఆలౌట్ అయ్యింది.

భారత బౌలర్లలో సిరాజ్, కులదీప్ చెరో మూడు; ఉమ్రాన్ మాలిక్ రెండు; అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్ మొదలు పెట్టింది… ఓపెనర్లు రోహిత్(17); శుభ్ మన్ గిల్ (21) తో పాటు విరాట్ కోహ్లీ కూడా (4) నిరాశ పరిచారు. కెఎల్ రాహుల్ ఒక్కడే 67 పరుగులు చేసి హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా­-36;  శ్రేయాస్ అయ్యర్­-28; అక్షర్ పటేల్ -21 రన్స్ చేసి ఫర్వాలేదనిపించారు. 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.

లంక బౌలర్లలో లాహిరు కుమార, కరుణరత్నే చెరో రెండు; రజిత, ధనుంజయ డిసిల్వా చెరో వికెట్ పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్