Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్CWG-2022: Women Hockey: ఇండియాకు రెండో విజయం

CWG-2022: Women Hockey: ఇండియాకు రెండో విజయం

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత మహిళల హాకీ జట్టు దూసుకుపోతోంది. నేడు వేల్స్ తో జరిగిన మ్యాచ్ లో 3-1తో విజయం సాధించి సెమీ ఫైనల్స్ కు చేరువైంది. నిన్న జరిగిన మ్యాచ్ లో ఘనా జట్టును 5-0తో ఓడించిన సంగతి విదితమే. వందనా కటారియా రెండు గోల్స్ తో సత్తా చాటింది.

నేడు జరిగిన రెండో మ్యాచ్ లో ఆట 26వ నిమిషంలో వందన పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి బోణీ చేసింది. ఆ వెంటనే గుర్జీత్ కౌర్ మరో గోల్ సాధించింది. 45వ నిమిషం వద్ద వేల్స్ జట్టు ఓ గోల్ సంపాదించింది. 48వ నిమిషంలో వందన మరో పెనాల్టీ కార్నర్ గోల్ చేసి ఆధిక్యాన్ని 3-1కి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఇరు జట్లూ గోల్ చేయలేకపోవడంతో ఇండియాను విజయం వరించింది.

మరో మ్యాచ్ లో విజయం సాధిస్తే నేరుగా సెమీస్ చేరే అవకాశం ఉంది.

Also Read :  ఘనాపై 5-0తో ఇండియా విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్