Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్India Vs Zimbabwe: తొలి వన్డేలో ఇండియా ఘన విజయం

India Vs Zimbabwe: తొలి వన్డేలో ఇండియా ఘన విజయం

జింబాబ్వేతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన తొలి వన్డేలో ఇండియా ఏకపక్షంగా విజయం సాధించింది. జింబాబ్వేను 189పరుగులకే కట్టడి చేసిన ఇండియా ఈ లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 30.5 ఓవర్లలోనే సాధించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్-81 (113 బంతుల్లో 9 ఫోర్లు); శుభమన్ గిల్ – 82 (71 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్సర్)  తో అజేయంగా నిలిచి విజయం అందించారు.

హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. జట్టులో కెప్టెన్ చకాబ్వా-35; నగరవ-34; బ్రాడ్ ఎవాన్స్-33 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఇండియా బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిద్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ఇండియా మరో 19.1 ఓవర్లు మిగిలి ఉండగానే 192 పరుగులు చేసింది.

దీపక్ చాహార్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్