Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్టి 20లోనూ ఇండియా క్లీన్ స్వీప్

టి 20లోనూ ఇండియా క్లీన్ స్వీప్

T20 Series also: వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ ను కూడా ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. నేడు జరిగిన చివరి, మూడవ మ్యాచ్ లో 17 పరుగులతో విజయం సాధించింది.  బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్ సిక్సర్లతో విరుచుకు పడి ఆడగా, వెంకటేష్ అయ్యర్ ఆల్ రౌండ్ ప్రతిభతో రాణించాడు. 185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టులో నికోలస్ పూరన్-61 (47 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) తో పాటు రోమానియో షెఫర్డ్-29; రోవ్ మ్యాన్ పావెల్-25 మాత్రమే రాణించారు, దీనితో విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఇండియా బౌలర్లలో హర్షల్  పటేల్ మూడు; దీపక్ చాహర్, వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ తలా రెండు వికెట్ పడగొట్టారు.

India T20 Series

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇషాన్ కిషన్ తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. రుతురాజ్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే  చేసి ఔటయ్యాడు. రెండో వికెట్ కు శ్రేయాస్ అయ్యర్- ఇషాన్ 53 పరుగులు జోడించారు. ఇషాన్ కిషన్-34; శ్రేయాస్ -25 పరుగులు చేసి ఔటయ్యారు. కెప్టెన్ రోహిత్ కేవలం ఏడు పరుగులే చేశాడు. వెంకటేష్ అయ్యర్-సూర్య కుమార్ యాదవ్ లు ఐదో వికెట్ కు 91 పరుగులు జోడించారు. సూర్య కుమార్ యాదవ్ 31 బంతుల్లో 1 ఫోర్, ఏడు సిక్సర్లతో 65 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. వెంకటేష్ అయ్యర్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

సూర్య కుమార్ యాదవ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ తో పాటు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టి 20 సిరీస్ లో కూడా అదే తరహాలో విజయం సాధించి సత్తా చాటింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్