Friday, April 19, 2024
Homeస్పోర్ట్స్కుదురుకున్న ఇండియా - 215/2

కుదురుకున్న ఇండియా – 215/2

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇండియా ఆట గాడిలో పడినట్లు కనబుతోంది. నిన్న మూడవ రోజు మెరుగైన ఆటతీరు ప్రదర్శించింది.  మొదటి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే ఆలౌట్ అయిన ఇండియా రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది.

న్యూ జిలాండ్ తో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ తో పాటు ఇంగ్లాండ్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో విఫలమైన చతేశ్వర్ పుజారా ఈ మ్యాచ్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఆచి తూచి ఆడే తన సహజ శైలికి  భిన్నంగా  50.56 స్త్రయిక్ రేట్ తో, 180 బంతులాడి  91 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.

8 వికెట్లకు 423 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 9 పరుగులు మాత్రమే జోడించి 432 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  ఇండియా బౌలర్లలో మహ్మద్ షమీ-4, సిరాజ్, జడేజా, బుమ్రాలు తలా 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 54 బంతులాడి కేవలం  8 పరుగులు చేసిన రాహూల్ ఓవర్టన్ బౌలింగ్ లో బెయిర్ స్టో కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత రోహిత్- పుజారా లు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ జట్టు స్కోరు 116 పరుగుల వద్ద ఓలీ రాబిన్సన్ బౌలింగ్ లో ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పుజారా తో కలిసి మరో మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 215 పరుగులు చేయగలిగింది.  ఇంగ్లాండ్ కంటే 139 పరుగులు వెనకబడి ఉంది. పుజారా-91, కోహ్లీ 45 పరుగులతో క్రీజులో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్