Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్పారాలింపిక్స్ : ఇండియాకు 13వ పతకం

పారాలింపిక్స్ : ఇండియాకు 13వ పతకం

పారాలింపిక్స్ లో ఇండియా 13వ పతకాన్ని సాధించింది. పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ విభాగంలో మన దేశానికి చెందిన హర్వీందర్ సింగ్ కాంస్య పతాకాన్ని గెల్చుకున్నాడు. కొరియాకు ఆటగాడు కిమ్ మినూ ను 6-5 తేడాతో ఓడించి కాంస్యం ఖాయం చేసుకున్నాడు. ఈ విజయంతో పారా ఒలింపిక్స్ ఆర్చరీ లో పతకం సాధించిన తొలి ఆటగాడిగా హర్వీందర్ చరిత్ర సృష్టించాడు.

టోక్యోలో జరుగుతోన్న పారాలింపిక్స్ లో ఇప్పటివరకూ ఇండియాకు మొత్తం 13 పతకాలు లభించాయి. వీటిలో 2 స్వర్ణం, 6 రజతం, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.

ఇండియా మొట్ట మొదటిసారి 1968 సమ్మర్ పారాలింపిక్స్ పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత 72లో జరిగిన క్రీడల్లో కూడా ప్రాతినిద్యం వహించింది. మళ్ళీ 1984 వరకూ పారాలింపిక్స్ కు దూరంగా ఉంది. అయితే 2016 వరకూ ఇండియా మొత్తం గెల్చుకున్న పతకాలు 12 కాగా, ఈ 2020 క్రీడల్లో ఇప్పటికే 13 పతకాలు గెల్చుకొని రికార్డు సృష్టించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్