Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్Asia Cup-2022: సూపర్ 4కు ఇండియా

Asia Cup-2022: సూపర్ 4కు ఇండియా

ఆసియా కప్ క్రికెట్ లో ఇండియా సూపర్ 4 కు చేరుకుంది. టోర్నీలో నేడు ఆడిన రెండో మ్యాచ్ లో హాగ్ కాంగ్ పై ఇండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి జట్టు 190 పరుగుల భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. ఆ తర్వాత హాంగ్ కాంగ్ సైతం విజయం కోసం పారాడి నిర్ణీత 20ఓవర్లలో 152పరుగులు చేయగలిగింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హాంగ్ కాంగ్ టాస్ గెలిచి ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఇండియా 38 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది, 13 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్సర్ తో 21  పరుగులు కొట్టి ఊపు మీదున్నట్లు కలిపించిన కెప్టెన్ రోహిత్ మరో సిక్సర్ బాడే క్రమంలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ కు దొరికిపోయాడు.  మరో ఓపెనర్ కెఎల్ రాహుల్- విరాట్ కోహ్లీ రెండో వికెట్ కు 56 పరుగులు జోడించారు. నెమ్మదిగా ఆడిన రాహుల్ 39 బంతుల్లో రెండు సిక్సర్లతో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ కోహ్లీతో కలిసి మూడో వికెట్ కు అజేయంగా 98 పరుగులు జోడించారు. కోహ్లీ 44బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 59; సూర్య 26 బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సర్లతో 68 పరుగులు చేశారు.

ఆ తర్వాత హాంగ్ కాంగ్ 12 పరుగులకే తొలి వికెట్ (యాసిం ముర్తాజా-9) కోల్పోయింది. బాబర్ హయత్ 35 బంతుల్లో 41; కిన్ చిట్ షా-30; జీషమ్ అలీ-26; చివర్లో స్కాట్ 8 బంతుల్లో 16 పరుగులతో స్ఫూర్తి దాయకమైన ఆట ప్రదర్శించారు.

ఇండియా బౌలర్లలో భువీ, ఆర్ష దీప్, జడేజా, అవేష్ తలా ఒక వికెట్ పడగొట్టారు

సూర్య కుమార్ యాదవ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read Asia Cup: సూపర్ 4 కు ఆఫ్ఘన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్