Sunday, September 29, 2024
Homeస్పోర్ట్స్రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్: సెమీస్ కు ఇండియా

రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్: సెమీస్ కు ఇండియా

కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా పై 24 పరుగులతో విజయం సాధించిన  టీమిండియా టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు దూసుకు వెళ్ళింది. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్ లు ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు.

సెయింట్ లూయీస్ లోని డెరిన్ సమీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండో ఓవర్లోనే కోహ్లీ డకౌట్  గా వెనుదిరిగాడు. ఈ దశలో రోహిత్ శర్మ… రిషభ్ పంత్ తో కలిసి సూపర్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో కంగారూ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. జట్టు స్కోరు 93 వద్ద పంత్ (15) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వారు కూడా భారీ స్కోరు కోసం తమ వంతు ప్రయత్నం చేశారు.
రోహిత్ 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 92 పరుగులు చేసి మూడో వికెట్ గా ఔటయ్యాడు.  సూర్య కుమార్ యాదవ్- 31 (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు); శివం దూబే-28 (22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) చేసి అవుట్ కాగా, హార్థిక్ పాండ్యా 27 (17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు)పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 205  భారీ స్కోరు చేసింది.

లక్ష్య సాధనలో ఆసీస్ 6 పరుగుల వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్(6) వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ 43 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76; కెప్టెన్ మిచెల్ మార్ష్-37; మాక్స్ వెల్ -20 పరుగులతో రాణించినా వెంట వెంట వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ 3; కుల్దీప్ యాదవ్ 2; బుమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 రన్స్ మాత్రమే చేయగలిగింది.

రోహిత్ శర్మకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దాకింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్