Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్పురుషుల ప్రో-లీగ్: ఇండియాపై నెదర్లాండ్స్ విజయం

పురుషుల ప్రో-లీగ్: ఇండియాపై నెదర్లాండ్స్ విజయం

India 3rd: ఎఫ్ఐహెచ్ ప్రోలీగ్ పురుషుల హాకీ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా- నెదర్లాండ్స్ జట్ల మధ్య నేడు జరిగిన రెండో మ్యాచ్ లో సైతం ఇండియా ఓటమి పాలయ్యింది. నిన్న జరిగిన 2-1 తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. నెదర్లాండ్స్ లోని రోటర్ డ్యాం హాకీ క్లబ్ వేదికగా  ఈ మ్యాచ్ జరిగింది.

మ్యాచ్ తొలి నిమిషంలోనే ఇండియాకు అభిషేక్ ఫీల్డ్ గోల్ ద్వారా బోణీ కొట్టాడు. 7,45 నిమిషాల్లో నెదర్లాండ్స్ రెండు పెనాల్టీ కార్నర్ గోల్స్ సాధించి పైచేయి సాధించింది. ఇండియా మరో గోల్ సాధించడంలో విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.

ఈ సీజన్ టోర్నమెంట్ లో ఇండియా పురుషులకు ఇదే ఆఖరి మ్యాచ్. నెదర్లాండ్స్ 36 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, 35 పాయింట్లతో బెల్జియం, 30తో ఇండియా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇండియా, బెల్జియం ఆడాల్సిన మ్యాచ్ లు అన్నీ పూర్తి కాగా, నెదర్లాండ్స్ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. దీనితో పురుషుల టోర్నీ లో నెదర్లాండ్స్ ఛాంపియన్ గా నిలవనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్