Thomas-Uber Cup: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్వర్యంలో జరుతుతోన్న టోటల్ ఇంజనీర్స్ థామస్ ఉబెర్ కప్ ఫైనల్స్ -2022లో రేపు జరగనున్న క్వార్టర్ ఫైనల్స్ లో భారత మహిళల జట్టు థాయ్ లాండ్ తో ….. పురుషుల జట్టు మలేషియా తో తలపడనున్నాయి,
థామస్ కప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో ఇండియా పురుషుల జట్టు 3-2 తేడాతో చినీస్ థైపీ తో ఓటమి పాలైంది. జర్మనీ, కెనడా తో జరిగిన మ్యాచ్ లను 5-0తో గెల్చుకున్న పురుషుల జట్టు నేడు జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో మాత్రం ఓటమి పాలైంది.
సింగిల్స్ విభాగంలో
- కిడంబి శ్రీకాంత్ 21-19; 21-16 తేడాతో వాంగ్ జు వీ పై….
- హెచ్ ఎస్ ప్రన్నోయ్ 21-10; 21-10 తేడాతో లూ చియా హాంగ్ పై గెలుపొందగా
- లక్ష్య సేన్ మాత్రం 21-19; 13-21; 21-17 తో చొ టీన్ చెన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
డబుల్స్ విభాగంలో
- సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం 21-11; 21-19 తేడాతో లీయాంగ్- వాంగ్ ఛీ లిన్ చేతిలో
- ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల జోడీ 21-17; 19-21; 21-19 తేడాతో లు చింగ్ యో –యాంగ్ పో హాన్ ద్వయం చేతిలో ఓటమి పాలయ్యారు.