Monday, January 20, 2025
HomeTrending Newsఉజ్బెకిస్తాన్ లో చిన్నారుల మృతిపై భారత్ విచారణ

ఉజ్బెకిస్తాన్ లో చిన్నారుల మృతిపై భారత్ విచారణ

ఉజ్బెకిస్తాన్ లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌ కారణమని ఉబ్జెకిస్తాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ మారియన్ బయోటెక్ తయారు చేసిన డోక్-1 మ్యాక్స్ సిరప్ తాగడం వల్లే పిల్లలు చనిపోయారని మంత్రిత్వ శాఖ తెలిపింది. వైద్యుల సూచన లేకుండా అధిక మోతాదులో పిల్లలకు దగ్గు మందు ఇవ్వడం వల్లే ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కంపెనీ ఈ ఏడాదే ఉబ్జెకిస్తాన్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తాజా సమాచారం ప్రకారం డోక్‌-1 మ్యాక్స్‌ సిరప్‌ ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించడం లేదు.
భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి  ఉజ్బెకిస్తాన్ లో 18 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఉజ్బెకిస్తాన్ ఘటన తమ దృష్టికి వచ్చిందని.. దానికి  సంబంధించిన వివరాలను తమకు అందించాలని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖను భారత్‌ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో-నార్త్‌ జోన్‌), ఉత్తరప్రదేశ్‌ డ్రగ్స్‌ కంట్రోలింగ్‌ అండ్‌ లైసెన్సింగ్‌ అథారిటీ బృందాలు సంయుక్తంగా సదరు మందుల కంపెనీపై విచారణ ప్రారంభించాయి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్