ICC Under 19 Womens T20 World Cup 2023: కెప్టెన్ అండర్ 19 వరల్డ్ కప్ లీగ్ దశలో ఇండియా వరుసగా మూడో విజయం నమోదు చేసింది. స్కాట్లాండ్ పై 83 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ గొంగడి త్రిష(57), రిచా ఘోష్(33), శ్వేతా షెరావత్(31*) లు బ్యాటింగ్ లో రాణించగా… మన్నత్ కాశ్యప్(4); అర్చనా దేవి(3), సోనమ్ యాదవ్(2) బౌలింగ్ లో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు,
సౌతాఫ్రికా బెన్నోయ్ లోని విల్లమూరు పార్క్ మైద్నానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ షఫాలీ వర్మ కేవలం రెండు పరుగులే చేసి ఔట్ కాగా, సోనియా మెందియా కూడా (6)త్వరగా పెవిలియన్ చేరింది. ఈ దశలో త్రిష -రిచా ఘోష్ లు మూడో వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. చివర్లో శ్వేతా షెరావత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేవలం 10 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. దీనితో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 149 పరుగులు చేసింది.
స్కాట్లాంట్ లో ఓపెనర్లు ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు. భారత బౌలర్ల దెబ్బకు 13.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
నాలుగు వికెట్లతో రాణించిన మన్నత్ కాశ్యప్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ ‘లభించింది.